పద్యం : --మిట్టపల్లి పరశురాములు

 1
*తే.గీ*
*జగతి విఖ్యాత పాటలు- జాలుపారె* 
*మధురభావాలుకురిపించె-మాటలందు* 
*వినినమదికెంతొవినిపించె-వీనులలర*
*మరువజాలనిమహనీయ-మాన్యుడతడు*
*2.*
*తే.గీ*
*వెళ్లెగీతాలువినిపించ-వేల్పులకును.*                         
*మళ్ళిరానని చెప్పెను-మనసువిప్పి*
 *అమరనాధునిబహుమతి-నందుకొనగ*            
*నరిగెబాలుమనలవీడి-నమరపురికి*