ఒక అడవిలో రకరకాల మొక్కలు, చెట్లు ఉండేవి. అవి అన్నీ కలిసి మెలసి అన్యోన్యంగా ఉండేవి. వాటిలో బ్రహ్మ జెముడు మొక్కలు చిన్న చిన్న మొక్కలను, పూల మొక్కలను తమ ముళ్ళతో గ్రుచ్చి ఆట పట్టిస్తూ, ఏడ్పిస్తూ పైశాచిక ఆనందం పొందేవి. పెద్ద చెట్లు వచ్చి బ్రహ్మజెముడు మొక్కలను మందలించినా తమ బుద్ధి మార్చు కోలేదు. పైగా మనుషులు కూడా మమ్ములను చూసి భయపడి దూరం దూరం వెళతారు మీరెంత అని అవహేళన చేస్తూ గర్వంగా మీసాలు మెలేస్తూ అడవంతా కలయ తిరిగి భయపెట్టేవి . వాటి బాధ పడలేక మొక్కలు, చెట్లు అన్నీ కలిసి వేరే చోటుకు తరలి పోయాయి.
అవి తరలి పోవడం చూసి ముమ్ములను చూసి భయపడి పారిపోతున్నాయని బ్రహ్మజెముడు మొక్కలు గర్వంతో విర్రవీగ సాగాయి.
పచ్చని మొక్కలు, చెట్లు లేక పోవడం వలన సంవత్సరాల తరబడి వర్షాలు కురవ లేదు. ఫలితంగా ఆ ప్రాంతమంతా పచ్చదనం అంతరించి బీడు భూమిగా మారిపోయి క్రమేపీ ఎడారిగా మారిపోవడం వలన అక్కడ ఎవరూ నివసించడం మానేసారు.ఆ ఎడారిలో బ్రహ్మజెముడు మొక్కలు బిక్కు బిక్కు మంటూ ఒంటరిగా నివసిస్తున్నాయి.
తమ గర్వము , పొగరే తమను ఏకాకులను చేసాయి అని ఇప్పుడు చింతిస్తున్నాయి .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి