పర్యావరణ కవితల పోటీలో *ప్రశంసాపత్రాలు*

 జిన్నారం:  ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా జూన్ 5నకరీంనగర్ కు చెందిన మహాతీ సాహితీ కవి సంగమం "పర్యావరణ పరిరక్షణ" అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలో బొల్లారం జడ్పీ పాఠశాలకు చెందిన బాలకవులు కొండపల్లి ఉదయ్ కిరణ్, దాసరి జగదీష్, శ్రీరాములు కుమారిలు పాల్గొని ప్రతిభ కనబరిచి ప్రశంసాపత్రాలు పొందారని పాఠశాల తెలుగు భాషోపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. కవితల పోటీలో పాల్గొని ప్రతిభ కనబరిచిన బాల కవుల్ని ప్రధానోపాధ్యాయుడు మంగీలాల్, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.