"ఈయన పంటికే కాదు..సాహిత్యానికీ చికిత్స చేస్తారు.." హగ్ మి క్విక్ (Hug Me Quick)
అంటున్న ….'డాక్టర్ కె.ఎల్.వి ప్రసాద్ '!!
పుట్టింది.(22.6.1953).' దిండి ' గ్రామం.( తూర్పు గోదావరి జిల్లా.)చదివింది..దిండి ప్రాథమిక పాఠశా
ల,రాజోలు జిల్లాపరిషత్ హైస్కూల్ లో మెట్రిక్ ,డిగ్రీ. హైదరాబాద్.డెంటల్‌ప్రభుత్వ డెంటల్ కాలేజ్ ,అఫ్జల్ గంజ్, హైదరాబాద్.వృత్తి.. ప్రభుత్వ డెంటల్ డాక్టర్.
వరంగల్ జిల్లా,మహాబూబాబాద్ లో సివిల్అసిస్టెంట్
సర్జన్ గా చేరారు.2005లో డిప్యూటీ సివిల్ సర్జన్ అయ్యారు.2011లో పదవీ విరమణ చేశారు. ప్రస్తు
తం హనుమకొండ (వరంగల్ ) లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు
వృత్తి పంటి డాక్టర్ గిరే అయినా..ప్రవృత్తి మాత్రం సాహిత్యం. ప్రఖ్యాత కథా,నవలా రచయిత కె.కె.మీనన్ గారికి ఈయన స్వయాన తమ్ముడు.
*సాహిత్య సౌరభం..!!
తెలుగులో కథలు,కవితలు రాస్తారు. పుస్తకాలు
బాగా చదువుతారు.రేడియో మాధ్యమం ద్వారా
ఈయన సుప్రసిద్ధులు. ఇప్పటికీ క్రమం తప్పకుండా
రేడియో వినే ప్రసాద్ గారు... రేడియోలో వైద్య విజ్ఞాన వ్యాసాలతో పాటు ,వ్యాసాలు, కథలు, కవితలు చదివారు. ఫోన్ ఇన్ ప్రోగ్రాముల్లో పాల్గొ
న్నారు.హైదరాబాద్,వరంగల్ దూరదర్శన్ కేంద్రాల
నుంచి విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించారు.
*కలంపట్టి రాసింది….!!
*కె.ఎల్ .వి కథలు
(తొలి కవితా సంపుటి.శ్రీమతికి అంకితం)
*అస్త్రం.. చిన్న కథలు
*హగ్ మి క్విక్...కథలు
*విషాద మహనీయం (ఎలిజీ)
*చిలుక పలుకులు (బాలల కవితలు)
*దంత సంరక్షణ..( వైద్య విజ్ఞానం)
*దంతాలు.. ఆరోగ్యం. (వైద్య విజ్ఞానం)
ప్రస్తుతం ఫేస్బుక్ లో కవితలు పోస్ట్ చేస్తున్నారు.
కథారచయితగా ' అస్త్రం ' తొలి కథ.1984 లో
స్వాతి వారపత్రికలో బాపు గారి బొమ్మ కు కథ
రాశారు..అది వెంటనే అచ్చయింది.అదే..'అస్త్రం'.
కథ..ఈచిన్నకథే..ప్రసాద్ సాహితీ వ్యాసంగానికి ప్రేరణ అయ్యింది.
*ఇంతకూ..ఏముందీ కథలో…?
ఇదో చిన్న కథ.సరదా కథ. బామ్మ గారికి జ్యోతిష్యం
అంటే నమ్మకం.ఓ రోజు దారివెంట పోతున్న ఓ కుర్ర
జ్యోతిష్కుడ్ని పిలిచి జ్యోతిష్యం చెప్పమంటుంది.
బామ్మ గురించి,బామ్మ కుటుంబ వివరాలను పూస
గుచ్చినట్లు చెబుతాడు.జ్యోతిష్కుడిపై బామ్మ కు నమ్మకం కలుగుతుంది. చివరగా జ్యోతిష్కుడు చెప్పిన మాటకు బామ్మ ఖంగు తింటుంది.
"మీ పెద్దబ్బాయి కూతురి పెళ్ళి మీ చావుతో ముడి
పడి వుంది.రెండు నెలల్లోగా మనవరాలి పెళ్ళి కాక
పోతే మీరు చచ్చిపోతారు' అంటాడు. మరి పిల్ల
చదువుకుంటోంది కదా నాయనా ! అంటుంది …
బామ్మ." అయితే.. మీరు చావుకు సిద్ధం కావలసి
వుంటుందంటూ..' హెచ్చరిస్తాడు.
బామ్మకు ప్రాణ భయం పట్టుకుంటుంది.వెంటనే
పెద్ద కొడుకును పిలిచి విషయం చెబుతుంది.రెండు
నెలల్లో పెళ్ళి జరిగిపోవాలని మొండికేస్తుంది.దాంతో
విధిలేక కూతురు పెళ్ళి చేస్తాడు.
కొత్త దంపతులు పెళ్ళి తర్వాత హానిమూన్ కు వెళ్ళి
వస్తారు. గుమ్మంలోకి ఎదురొచ్చిన బామ్మ ను చూసి
పెళ్ళికొడుకు ఇలా అంటాడు.
'బామ్మ గారు నన్ను గుర్తు పెట్టారా?
నువ్వు నా మనవరాలి మొగుడివే కదా!
అంటుంది బామ్మ. పెళ్ళికాక ముందు మీరు
నన్ను జ్యోతిష్కుడిగా చూశారు కదా ! గుర్తుపట్ట
లేదా ? అంటాడు పెళ్ళికొడుకు. బామ్మ నోరెళ్ళ పెడుతుంది. అదీ సంగతి.! ఇప్పుడు మీకు అసలు కథ అర్థమైందనుకుంటాను.
అస్త్రం కథల సంపుటిలోని ' ఆటోవాలా ' కథ…,
సీరియస్ కథ..ఆలోచింపజేసే కథ. కార్యాలయాల్లో
లంచాలు తినేవారికి చెప్పుదెబ్బలాంటి సందేశం వున్న కథ. లంచాలు మరిగిన శ్రీనివాస్ మూర్తి
ఓ రోజు భార్యతో సెకెండ్ షో సినిమాకు వెళతాడు.
సినిమా వదిలాక ఆటో ఎక్కుతారు.కానీ ఎక్కడి
కెళ్ళాలో అడ్రస్ చెప్పరు. అయితే..'ఇంటి అడ్రస్
నాకు తెలుసండి 'అంటాడు ఆటో డ్రైవర్. అనడమే
కాదు.. ఇంటి ముందుకు తీసుకెళ్ళి ఆటో ఆపుతా
డు. శ్రీనివాసమూర్తికేం అర్థం కాదు. తీరా చూస్తే అతను తన ఆఫీసులో పనిచేసే అసిస్టెంట్ సింగ్.
ఏమిటిది? అంటాడు శ్రీనివాసమూర్తి. "నన్నిలా... చూడ్డం మీకు కొత్తేమో గానీ.. రెండేళ్ళుగా రాత్రు
ళ్ళు ఆటో నడుపుతున్నాను.మీకు తెలుసు కదా! నాకొచ్చే జీతంతో కుటుంబం గడవటం కష్టంగా వుంది. ఆఫీసులో లంచాల పాపం కూడు తినడం నాకిష్టం లేదు. అందుకే ఇలా ఆటో నడుపుతున్నా
ను. ఏదైనా కష్టపడి సంపాదిస్తేనే తృప్తి." ..అంటాడు సింగ్…!
ఈ మాటలు విన్న శ్రీనివాసమూర్తి భార్య ' భర్త వంక
పురుగును చూసినట్లు చూస్తుంది.'.. కథ ముగుస్తుం
ది. ఈ కథ ముగింపు పాఠకులను వెంటాడుతుంది.
*విషాద మహనీయం…(ఎలిజీ)
తమ అక్క కుమారి కానేటి మహనీయమ్మ గారి
స్మతి జ్ఞాపకాల కదంబం ఈ పుస్తకం. పేరుకు తగ్గ
ట్టే అక్కగారి జీవితం ' మహనీయం ' అంటారు..
రచియిత. అయితే ఆయనకు అన్నీ వుండి కూడా అక్క లేకపోవడం వల్ల కలిగిన బాధ అంతా ఇంతా కాదు. తమను పెంచి పోషించి, అభ్యున్నతికి కారణ
మైన ' అక్క' జ్ఞాపకాలను ఇలా అక్షరాలుగా అల్లి
సాంత్వన పొందారు రచయిత.
"తాను పూర్తిగా అతి సాధారణ జీవితానికి అలవా
టు పడి,తన తమ్ముళ్ళు,చెల్లెళ్ళు అభివృద్ధికే తన
సొమ్మంతా ఖర్చు పెట్టింది.మాతో పాటు,బంధువుల
పిల్లలను చేరదీసి, విద్యాదానం చేసింది. తను కొవ్వొ
త్తిలా వెలుగుతూ.. మాకు వెలుగును ప్రసాదించి
న గొప్ప 'మానవతా మూర్తి' మా అక్క " అంటారు
రచయిత ప్రసాద్.
*చిలుక పలుకులు..!!
మనవరాలి "చిలుకపలుకుల్ని " ఇలా కవిత్వం
చేశారు డాక్టర్ ప్రసాద్ గారు.
"చిట్టి... చిట్టి
తెల్లని పళ్ళు
చిగుళ్ళకు
ముత్యాలు అమర్చిన ట్టు
నవ్వుకు
నగిషీలు చెక్కుతాయి"(,సంకేతం)
*అమ్మకు నేనెప్పుడూ
బొమ్మనే….
ముద్దొచ్చినప్పుడల్లా..
నా...బంగారు బొమ్మా
అంటుంది..'(అమ్మ బొమ్మ)
"ఏం... తాతో..
ఎల్దమొస్తవా!
గోదారొడ్డున
గ్రామమున్నదట
అదే..అదే..లే
దిండి గ్రామ మాట
పచ్చ పచ్చనీ
పొలాలుండునట
కొబ్బరి చెట్లకు
కొదవే లేదట.!! (ఎల్దమొస్తవా!)
ఇలా మనవరాలి ముద్దూ ముచ్చట్లతో సాగే
చిట్టిపొట్టి కవితల సంపుటిది. ఇందులో కవిత్వం
కంటే కూడా తాత ప్రేమే ఎక్కువగా కనబడుతుంది.
కరోనాలో పిల్లలు చదువులు ఎలా రంగు మారా
యో? కూడా చక్కగా చెప్పారు.
*హగ్ మి క్విక్..కథా సంపుటి..!!
మొత్తం 26 కథలు సంపుటిలోని.అన్నీ సామాజిక
అంశాలతో ముడిపడిన కథలే..
'పరిగె' కథలో టిక్కెట్టు కొట్టకుండా కక్కుర్తి పడే బస్
కండక్టర్ ను చూపెట్టారు. "పెద్దోడు పంటనే దోచుకుం
టుంటే...చిన్నోడు పరిగె పట్టుకోవడంలో తప్పేముం
దిలే " అంటూ ఈ కథను ముగించిన తీరు గొప్పగా
వుంది.
మానవత్వం పరిమళించే మంచి కథ.' హగ్ మి క్విక్'
ఓ కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పనిచేసే చంద్రికి ప్రమాద
వశాత్తు చేయి పోతుంది. అంతకు ముందు నుంచే
చంద్రిక,హన్మంతు ప్రేమలో వుంటారు.. చేయిపోయి
కుంటి కావడంతో చంద్రి క్రమంగా హన్మంతుకుదూరం
గా జరగడం మొదలు పెడుతుంది.అయితే హన్మంతు
మాత్రం చంద్రినే పెళ్ళి చేసుకోవాలని పట్టుదలగా
వుంటాడు. వీళ్ళ వివాహానికి హన్మంతు తండ్రి….
'ససేమిరా' అంటాడు. విషయం తెలుసుకున్న ఫ్యాక్ట
రీ యజమాని జోక్యం చేసుకొని, హన్మంతు తండ్రిని
ఒప్పిస్తాడు.. హన్మంతు, చంద్రికతో వివాహం జరు
గుతుంది. కథ సుఖాంతం అవుతుంది.
బావా అంటూ చంద్రిక….హన్మంతు కౌగిలిలో కరిగి పోతుంది. స్వచ్ఛమైన ప్రేమ పరిమిళించిన కథ ఇది.
ఈ సంపుటి లోని కథలన్నీ దాదాపు చిన్న కథలే. నిడివి తక్కువగా వున్నా.. 'సరుకు ' మాత్రం పుష్క
లంగా వుంది. కథకుడు మన ఎదుట కూర్చొని మామూలుగా కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. ప్రసాద్ గారి కథనం శైలి సింప్లీ సూపర్బ్. తప్పక చదవాల్సిన కథలు.
*కవిత్వం…!!
డాక్టర్ ప్రసాద్ గారి వచన కవిత్వం సామాజిక స్పృహతో సూటిగా ప్రశ్నిస్తుంది.
*"ప్రశ్నించే ప్రతివాడు
ప్రతిపక్షమే ....!
పొగడ్తలతో ముంచే
ప్రతివాడూ స్వపక్షమే !
నిజాలను నిజాలుగా
చెప్పేవాడు ప్రతివాడూ
విపక్షమే ....!
యధార్ధాలను కప్పి పుచ్చి
స్వార్ధాన్ని పీకలదాకా మింగి
తప్పును కూడా ఒప్పుగా చెప్పే
ప్రతివాడూ స్వపక్షమే !
కాలం చేసే లిట్మస్ పరీక్షలో
స్వపక్షం మొత్తం
విపక్షం కావడానికి
స్వల్ప సమయం చాలు.!!
...బొమ్మ ….బొరుసు..!!
*డా.కె.ఎల్వీ.ప్రసాద్.!
ప్రశ్నించే వారెప్పుడూప్రతిపక్షమే..పొగిడేవాడె
ప్పుడూ ...స్వపక్షమే.ఇదే నేటి లోకరీతి.
నిజాలను కప్పి పుచ్చి స్వార్ధాన్ని పీకలదాకా మింగి
తప్పును కూడా ఒప్పుగా చెప్పే ప్రతివాడూ స్వపక్షమే అంటారు కవి. అలాగే… నిజాలను నిజాలుగా చెప్పే
ప్రతివాడూ విపక్షమే … కాలం పెట్టే లిట్మస్ పరీక్షలో
స్వపక్షం మొత్తం విపక్షం కావడానికి కొద్ది సమయం చాలు….అంటారు కవి.
*లోకానుభవాలు….(డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్)!!
*ఏ యెండకు...ఆ గొడుగు....
రాజకీయపుటడుగు!!
*పుస్తకంఅచ్చువేయాలంటే , వాటిని
అమ్మేనైపుణ్యం కూడా కావాలి!!
*రిటర్న్ గిఫ్ట్స్ గా పుస్తకాలు బహుకరించడం
అలవాటు కావాలి!!
*పాఠశాలల్లోకళాశాలల్లోసాధారణ పుస్తకాలు
చదూకోడానికి తప్పని సరిగా ఒక పీరియడ్
కేటాయించాలి!!
*వైద్య విజ్ఞాన అంశాలుతెలుగులో రాసేవారికి
ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి!!
*మొక్కలు నాటడానికిఅనువైన సమయం!
వచ్చేసింది వర్షాకాలం!!
*పచ్చని చెట్టునుసంరక్షించడంఅంటే....
మనల్ని మనం సంరక్షించుకోవడమే!!
*స్వార్ధంఅడవులునరికేస్తే,చేతకాని తనం
వర్షించని మేఘాల వంకచూస్తుంటుంది!!
*చెట్టుబ్రతకాలంటే మనిషిబ్రతకాలి!
మనిషి బ్రతకాలంటే, చెట్లు నాటాలి!!
*ఒక మొక్కబహుమతిగా ఇవ్వు!
కలకాలంపచ్చ పచ్చ గా వర్ధిల్లు......!!
*వైద్యుడు,కవి, సామాజిక వేత్త,బహుముఖ ప్రతిభ
కలిగిన డాక్టర్ కె.ఎల్.వి ప్రసాద్ 'గారికిఅభినందనలు
*ఎ.రజాహుస్సేన్.!!
(A..Raja Hussain)
Hyderabad.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి