ఆయనకు వర్ధంతా!
అదొక నిత్యజీవకవితాస్రవంతి!
ఆ అక్షరానికి నిత్యం జయంతి!
సింగిరెడ్డి-కవితా సివంగి!
కవిత్వం-నారాయణీయం!
కవితాంబరాన,
*విశ్వంభర* నిలిచింది!
*జ్ఞానపీఠం* గెలిచింది!
ఆయన మాట విరుపు,
నిలిచిపోయే మెరుపు,
వినేవారికి మైమరపు!
ఆయన కలం పరుగు,
అక్షరలేళ్ళ చురుకు,
ఆపాట అక్షర జిలుగు,
గాయక గళాన ,
మాధుర్యం చిలుకు,
ఆయన తలపు,
కవిత్వానికి తెరిచిన తలుపు!
రూపాన మన్మథుడు,
అక్షరాన అగ్రగణ్యుడు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి