*సూక్తి సుధ*:-మిట్టపల్లి పరశురాములు

             ఆటవెలదులు

ఆత్మశుద్దికలిగి-నాచరించెడిపూజ
పాకశుద్దియున్న-పాయసంబు
చిత్తశుద్దితోడ-శివపూజచేయరా!
పరశురాముమాట-పసిడిమూట

సర్వప్రాణులనుసమముగాజూడుము  
అన్నిటందునున్ననాత్మయొకటె 
జీవహింసనెపుడుజేయగారాదురా
పరశురాముమాట పసిడిమూట

ధనముధాన్యమధిక-కనకంబుగలిగిన
మాతృమూర్తి ప్రేమ మరువదగునె?  
విత్తమదమునెపుడు-చెత్తతోసమమురా  
పరశురాముమాట-పసిడిమూట

కండబలముజూచి-గర్వమొందగరాదు
సిరులవలనపొంగి-పొరలరాదు 
కలిమిసిరులునెపుడు-కావడికుండలు
పరశురాముమాట-పసిడిమూట


కామెంట్‌లు