కల్వకుర్తి గుర్రాల లక్ష్మారెడ్డికి విశ్వ కవి సమ్మేళనం కవిత పోటీ లో తృతీయ బహుమతి.

 ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ( WAM) global literary forum ) మరియు మానస భారతి సాహితీ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాల విశ్వ కవి సమ్మేళనం కవితా పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి స్థానిక వాస్తవ్యుడు గుర్రాల లక్ష్మారెడ్డి గారు జి హెచ్ ఎం రిటైర్డ్ టీచర్ తృతీయ బహుమతి గెలుచుకొని కల్వకుర్తి కవుల సత్తాను చాటారు. ఆదివారం  13 జూన్ నా జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన అంతర్జాల విశ్వ కవి సమ్మేళనం లో గుర్రాల లక్ష్మారెడ్డి గారు పాల్గొని తన కవితా ప్రతిభను ప్రదర్శించారు.
          మనలో మనోబలం కరోనా తిరోగమనం అనే అంశంపై జరిగిన ఈ కవి సమ్మేళనం లో ప్రపంచవ్యాప్తంగా ఎందరో పాల్గొని తమ తమ కవితలు వినిపించారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ రోశయ్య స్థాపించిన వామ్ గ్లోబల్ లిటరరీ ఫోరం ప్రపంచ రికార్డుల గ్రహీత కవిరత్న డాక్టర్ శ్రీ చింతల శ్రీనివాస్ నేతృత్వంలో ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్రాల లక్ష్మారెడ్డి గారు బాలసాహిత్యంలో దిట్ట అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్న అంతర్జాల విశ్వ కవి సమ్మేళనం లో లో గుర్రాల లక్ష్మారెడ్డి గారు తృతీయ బహుమతి గెలుచుకోవడం వల్ల కల్వకుర్తికి చెందిన ఎంతోమంది సాహితీప్రియులు ఆయనకు అభినందనలు తెలిపారు

కామెంట్‌లు