ఓటమిలో విజయం.:- డాక్టర్. బెల్లంకొండ నాగేశ్వర్ రావు

 పూర్వం అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు  పాలిస్తుండేవాడు. అతని మంత్రి పేరు సుబుధ్ధి. వారి రాజ్యంలో ప్రతి ఏడు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
        ఆ సంవత్సరం అమరావతి రాజ్య సేనాని వృధాప్యంతో తన పదవి నుండి తప్పుకోవడంతో,  ఆ పదవికి తగిన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యత  మంత్రి సుబుద్ధికి అప్పగించాడు రాజు చెంద్రసేనుడు.
       దసరా ఉత్సవాలలో జరిగే పోటీలలో కత్తి యుధ్ధంలో విజేతగా వచ్చిన వారినే సర్వ సైన్యాధిపతిగా నియమిస్తామని, కత్తి యుధ్ధంలో పాల్గొన్న ప్రతి  పౌరుడికి  వారివారి పోరాట పటిమను బట్టి సైన్యం లో సముచిత స్ధానం కలిగిస్తామని మంత్రి సుబుధ్ధి ప్రకటించాడు.
       కత్తి యుధ్ధ పోటీలు రెండు రోజులు జరిగాయి. పలువురు యువకులు పాల్గొన్నారు. చివరిగా మొదటి నుండి గెలుస్తూ వస్తున్న విజయుడు అనే యువకుడు, తన పెదనాన్న కుమారుడు తన బాల్య ప్రాణ స్నేహితుడు అన్న వరుస అయిన శివయ్య చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు.
         సైన్యాధికారి పదవి శివయ్యకు దక్కింది.  విజయునికి దళపతి పదవి దక్కగా, కత్తియుధ్ధలో పాల్గోన్న ప్రతివారిని వారి పోరాడే విధానాన్ని బట్టి సైన్యంలోనికి తీసుకున్నారు.
       ఓటమి పొందిన విజయుని కలసిన మంత్రి సుబుద్ధి  "నాయనా! శివయ్య, నువ్వు ఇద్దరు దేశభక్తులే.  ఆ విషయం నాకు తెలుసు. కత్తి పట్టిన నాటి నుండి ఓటమి ఎరుగని నీవు  వరుసకు అన్నగారైన శివయ్య చేతిలో అనూహ్యంగా ఓడిపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. శివయ్య కూడా మంచి పోరాట యోధుడే, నీ వీరత్వం, పోరాట పటిమ గురించి వేగుల ద్వారా తెలుసుకున్నాను. నువ్వు ఆ గర్బ శ్రీమంతుడివి. కావాలని నీ ప్రాణ స్నేహితుడు అయిన నీ అన్న శివయ్య చేతిలో ఓడిపోయావు. అయినా  ఓటమి లో విజయం పొందావు. నీచర్య వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది వివరంగా చెప్పు' అన్నాడు మంత్రి.
      బాలలు! కత్తి పట్టిననాటి నుండి ఓటమి ఎరుగని విజయుడు ఎందుకు ఓడిపోయాడో చెప్పగలరా?'అన్నాడు తాతయ్య.
      "అయ్యా! విజయుడు శివయ్య బాల్యం నుండి కలసి చదువుకుని కత్తియుధ్ధం నేర్చుకున్నారు. విజయుని కుటుంబం నేడు ధనవంతులుగా ఉండటానికి కారణం శివయ్య కుటుంబం అయి ఉండాలి.  పేదరికంలో ఉన్న తన అన్న శివయ్యకు ఉన్నతమైన సైన్యాధిపతి పదవి దక్కేలా చేయాలని విజయుడు ఈనిర్ణయం తీసుకున్నాడు. శివయ్య కుటుంబం ఆర్థికంగా బలపడటంతో పాటు వారి కుటుంబానికి సమాజంలో సముచిత స్ధానం లభిస్తుంది. 
       విజయుడు కూడా సైన్యంలో ఉండి యుధ్ధం అంటూ వస్తే తన అన్న శివయ్యతో కలసి శత్రు సైన్యాలను ఎదుర్కుంటారు కనక అన్నివిధాల ఆలోచించి ఈ నిర్ణం తీసుకున్నాడు. అలా విజయుడు ఓటమిలో విజయం  సాధించాడు" అన్నారు పిల్లలు .
కామెంట్‌లు