ప్రకృతిని దేవతగా పరిగణ జేసి
పూజలు సల్పేరు పుడమి నందు,
విధ్వంస కార్యాలు విపరీతమైన చో
విలయ తాండవము తో విర్రవీగు,
మానవ లోకము మనుగడ సాగించ
యిబ్బంది నేర్పడు నిలన మనకు,
పర్యావరణ మును పదిలంగ జూసిన
ఆరు గాలాలలో హాయి నిచ్చు,
స్త్రీలను ప్రకృతిని క్షేమంగ జూచుచు
కంటికి రెప్పలా కాయు మెపుడు,
వనితలు లేనిల్లు వనములా తలపించు
వసుధన జూడగ వైనమిదియు,
మగువలే యింటికి మాణిక్య జ్యోతులు
తీర్చిదిద్ది మనలదేవతలుగను,
కాసింత స్త్రీపైన కరుణ జూపిన గాని
యెన్ని కష్టాలైన యేవగించు.
తేటగీతి
ప్రకృతి పడతుల బంధంబు పావనంబు,
తరచి జూడగ నిద్దరుదండి వారు,
యింతి లేకున్న జన్మము నిలనలేదు,
ప్రకృతి, మగువల నాశనం ప్రళయమొచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి