విద్యార్థులకు పునశ్చరణమే పునాది ::---యాడవరo చంద్రకాంత్ గౌడ్పెద్ద గుండవెల్లి ,సిద్దిపేట జిల్లా9441762105

 

గత ఏడాదిన్నర కాలం నుండి కరోనా మహమ్మారి విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసింది .నేటి బాలలే రేపటి పౌరులు గా విరాజిల్లే భావితరాలు ఇంటికే పరిమితమైనవి .ప్రత్యక్ష తరగతులు కాకుండా పరోక్ష  తరగతులకే మొగ్గుచూపింది ప్రభుత్వం .సెల్ ఫోన్ ,టీవీ, కంప్యూటర్, ట్యాబ్ ద్వారా ఆన్లైన్ క్లాసులు బోధిస్తున్న ఉపాధ్యాయలు ,విద్యార్థుల భవితవ్యాన్నిఎంతవరకు తీర్చిదిద్దినవనేది ఆలోచించదగ్గ పరిణామం.
పాఠశాలల్లో పిల్లలు ఆడుతూ, పాడుతూ పాఠాలు నేర్చుకునే వారు.  చేతుల్లో సెల్ఫోన్ల ను పట్టుకొని పాఠాలు వినకుండా , అశ్రద్ధ కనబరుస్తున్నారు.ఇది చివరికి ఎంతవరకు దారితీసిందంటే, రకరకాల వీడియో గేమ్ లు, పబ్జి, ఫ్రీ ఫైర్ లాంటి ఆటల వల్ల  చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే  ఎంత ప్రమాద మో ఊహించ వచ్చు.
ఎట్టకేలకు ఈ విద్యా సంవత్సరం (2021 _22) జులై 1వ తారీఖు నుండి ప్రారంభమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన పిల్లలు బడికి వచ్చిన తర్వాత, వారికి నేరుగా ప్రస్తుత తరగతి పాఠాలు చెప్పకుండా, క్రింది తరగతుల్లో నేర్చుకున్న బేసిక్స్ మాత్రమే నేర్పించాల్సిన అవసరం ఎంతవరకైనా ఉంది. ముఖ్యంగా భాషల పట్ల అది మాతృభాష, జాతీయ, అంతర్జాతీయ భాషలపై పిల్ల లు పట్టు కోల్పోయారు అనేది సత్యం. ఇటీవలె చేసిన అనేక సర్వేలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేశాయి.
పిల్లలకు భాషలపై ప్రస్తుతం పట్టు సాధించే విధంగా పాఠశాలలో తీర్చిదిద్దితే, మిగతా సబ్జెక్టులను సులభంగా నేర్చుకుంటారు. అంతేకాకుండా కరోనా కష్ట సమయంలో కోల్పోయిన విద్యా నష్టాన్ని కొంతవరకైనా పూడ్చుకుoటాడు .నెల రోజుల సమయాన్ని ఉపాధ్యాయులు అందరూ, పిల్లలకు సులభమైన విధంగా, ఒక సమయసారిణి ని పిల్లల పరంగా ,సబ్జెక్టు పరంగా ఏర్పాటు చేసుకుoటే విద్యార్థుల లో తప్పనిసరిగా కనీస అభ్యసన సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది.
విద్యార్థుల కు పెద్ద ,చిన్న  తరగతులు అనే తేడా లేకుండా అవసరమైతే ,పెద్దబాలశిక్ష నుండి అన్ని నేర్పించాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది .అదేవిధంగా విద్యార్థులకు పఠనo లో కూడా తర్ఫీదు ఇవ్వాలి . కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్లైన్ పాఠాలు వినడం కానీ, చదవడం ,రాయడం పూర్తిగా మర్చిపోయారు .అందుకే అందమైన చేతి రాత కోసం కూడా విద్యార్థులకు తరగతి గదిలో రకరకాల కృత్యాలను ఏర్పాటు చేస్తే ,కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. చదవడం రాయడం నేర్చుకుని విద్యార్థి జీవితంలో సులభంగా ముందుకెళ్తాడు.
ప్రతి పాఠశాల తనకు తానుగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను  విద్యార్థుల  సామర్థ్యాలను అనుసరించి ఏర్పాటు చేసుకోవాలి .అంతేకాకుండా ఒక్కో తరగతి ని ఒక్కో ఉపాధ్యాయుడు దత్తత తీసుకొని విద్యార్థుల్లో నూటికి నూరు శాతం బేసిక్స్ నేర్పించి నట్లయితే ప్రస్తుత తరగతికి సంబంధించిన పాఠాలను సులభంగా అర్థం చేసుకుంటారు ఈ విధంగా  నెలరోజులపాటు విద్యార్థులకు  బేసిక్స్ ను ఒక యజ్ఞంలా భావించి నేర్పించినట్లయితే విద్యార్థి మానసికంగా అభివృద్ధి చెందుతాడు. విద్యా అవరోధాలను అధిగమిస్తాడు.

కామెంట్‌లు