అనగనగా ఒక ఊరిలో కట్టెలు కొట్టే రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు.ఒక రోజు రంగయ్య అడవిలోకి వెళ్లి ఏ చెట్లు పెద్దగా ఉన్నాయో చూస్తుండగా ఒక సముద్రం పక్కన రెండు పెద్ద మామిడి చెట్లు కనిపించాయి. అతను అనుకున్నాడు ఈ రెండు చెట్లు అమ్మితే నా అవసరాలు అన్ని తీరిపోతాయి. అనీ అనుకున్నాడు. మరుసటి రోజు ఆ చెట్టును నరుకుతూ ఉండగా అతని చేయి జారి గొడ్డలి నీటిలో పడిపోయింది. రంగయ్య జల దేవుడిని ప్రార్థించాడు, స్వామి నా గొడ్డలి నీటిలో పడిపోయింది నా గొడ్డలి నాకు తెచ్చి ఇవ్వరా స్వామి అని వేడుకుంటాడు. అప్పుడు జల దేవుడు తనకు కనిపించి ఏమైంది భక్తుడా అని అడుగుతాడు. నా గొడ్డలి నాకు అందించు స్వామి అని అడుగుతాడు. నువ్వు నా భక్తుడవి నువ్వు నన్ను ప్రార్థించారు అని తన గొడ్డలిని తనకు అందిస్తాడు. రంగయ్య కృతజ్ఞతలు స్వామి అని అంటాడు. అప్పుడు జల దేవుడు భక్తుడిని ఆ గొడ్డలితో ఏం చేస్తావు అని అడుగుతాడు. ఈ రెండు మామిడి చెట్లను నరుకుతాను స్వామి అని అంటాడు రంగయ్య. అప్పుడు జల దేవుడు రంగయ్యను ఎప్పుడు చెట్లు నరకకుండా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. జల దేవుడు అంటాడు ఇప్పుడు ఈ గొడ్డలి నీటిలో పడిపోయినప్పుడు నువ్వు నన్ను ప్రార్థించారు కదా! అలాగే ఇప్పుడు ఆ రెండు మామిడి చెట్లు కూడా నిన్ను ప్రార్థిస్తున్నాం. ఏమని అంటే నువ్వు నరక వద్దని. జల దేవుడు అంటాడు రంగయ్య కొంచెం సేపు ఆలోచించు ఇప్పుడు నువ్వు చెట్టు నరికి వేస్తే నీకు కలప మాత్రమే లభిస్తుంది. అదే ఈ చుట్టు నరకకుండా ఉంటే ఎన్ని లాభాలో ఆలోచించు. నువ్వు చెట్ల నుంచి మామిడి పండ్లు రాల్చి అమ్ముకో నీ అవసరాన్ని తీరిపోతాయి. అలాగే నువ్వు ఎప్పుడూ అలసిపోయిన ఈ చెట్ల కింద కూర్చొని ఈ చెట్టుని అలసట తీరుస్తాయి. అలాగే వీటి చల్లనైన గాలిలో నీడలో కూర్చో ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ చెట్టును నరికి వేస్తే ముందు మనకు స్వచ్ఛమైన గాలి దొరుకుతుందా. ఈ చెట్ల వల్ల వర్షం కురిసేది. చూశావా చెట్లు నరికి వేస్తే నీకు కలప మాత్రమే లభించేది. అదే చెట్లను పెంచితే ఎన్ని లాభాలో చూశావా అని చెప్పి ఆ దేవుడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత రంగయ్య మారి, మరి కొన్ని చెట్లు నాటుతాడు. తను తన తప్పును తెలుసుకున్నాడు.
నీతి: మనం కూడా ఏ చెట్లను నరక కూడదు. చెట్లను పెంచాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి