*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౪౯ - 49)

 మత్తేభము:
*జలకంబుల్ రసముల్ ప్రసూనముల్ వా | చాబంధముల్ వాద్యము*
*ల్కల శబ్దధ్వనులచితాంబర మలం | కారంబు దీప్తుల్మెరుం*
*గులు నైవేద్యము మాధురీ మహిమగా | గొల్తున్నినున్ భక్తి రం*
*జిల దివ్యార్చనగూర్చి నేర్చిన క్రియన్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నాకు తెలిసిన విద్య ఒక్కటే అని నీకు తెలుసు కదా, స్వామీ.  కవితలో వచ్చే భావాలే నీకు ఆభరణములుగా అనుకో.  పొగడ్తలే నీ పూకు పువ్వులు, మంగళ వాయిద్యాలు. ఆకాశమే నీ పూజకు పందిరి. ఈ భూమి నీ పూజకు పీట.  ఈ కవిత్వాలతోనే నీ పూజ చేయగలను మహాదేవా!......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు