ఏ మాట చెప్పినా పెడచెవిన పెడతావ్ ఏంది రా... పెద్దల మాట సద్ది మూట అని ఊరికే అన్నారా...
తాతయ్య ఏది చెప్పినా వినాలి అని కొడుకుతో అనగానే..
ఆ మాటకు అర్థమేంది నాన్న.. అని కొడుకు అడగగా..
నాకన్నా మా నాన్న బాగా చెపుతారు. వెళ్లి ఆయననే అడుగు అన్నాడు నాన్న.
తాతయ్య దగ్గరికి వెళ్లిన మనవడు-నాన్న అన్న సామెత చెప్పి అర్థం చెప్ప మనగా..
ఇప్పుడు అంటే హోటల్లు ఉన్నాయి. ఎక్కడపడితే అక్కడ భోజనమో, అల్పాహారమో చేస్తున్నాం.
మా నాన్న, తాతయ్యల కాలంలో నైతే.. వాళ్లు ఎక్కడికి వెళ్ళినా వాళ్ల వెంబడి సద్ది తీసుకుని వెళ్లేవారట. ఇంతెందుకు నేను నారాయణఖేడ్ లో ఉపాధ్యాయునిగా పని చేసినప్పుడు... పెరుగన్నం, ఆవ తీసుకొని వెళ్ళేవాళ్ళం. మీ నానమ్మ, నాన్న, అత్తయ్యలు కూర్చుండి మెదక్ లో తినేవాళ్ళం.
ఇక పెద్దల మాట అంటే వయసు ద్వారా ఎంతో అనుభవం పొందుతారు. ఆ అనుభవాన్ని వాళ్ల భావితరానికి వినిపిస్తుంటారు. అందుకే పెద్దల మాట సద్ది మూట అంటారు. అనగానే నీ మాట ఎప్పుడూ వింటా తాతయ్య అనగానే. బోసినవ్వులతో తాతయ్య పకపక నవ్వాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి