పద్యాంజలి!!!:-కట్టరంజిత్ కుమార్ , తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
కం.
హనుమాజిపేటపల్లెను
జనియించెనుకవికిరీటిసంతోషముగన్
పనిమంతుని,గుణవంతుని
మనతెల్గులవెల్గుఱేడుమదిదల్తునికన్!!!
02.
కం.
శారదమాతనుగొల్చియు
నారాయణరెడ్డిగారునవ్యకవితలన్
హారముగానర్పించియు
రారమ్మనిపిల్వనిల్చె ,రసనాగ్రముపై!!!
03.
కం.
మాటకుదండముబెట్టెను
పాటకుదండమ్ముబెట్టెభవ్యముగనిలన్
మాటను,పాటనునమ్మిన
పాటిగమనిషికిసినారెప్రాంజలినిచ్చెన్!!!
04.
కం.
వ్రాసియు"ప్రపంచపదులను"
భాసిల్గగతెల్గునందువర్ధిలజేసెన్
వాసిగనూత్నవినూత్నము
చేసెనుసరిక్రొత్తసృష్టిచేతమ్మలరన్!!!
05.
కం.
కలమునుచేతనుబూనియు
విలసితసద్గ్రంథములనువిరచించియుతా
విలువగుసాహితిప్రభతో
వెలిగినవిశ్వంభరుడికివేలప్రణతుల్!!!

06.
ఉ.
భారతిపుత్రరత్నమయిప్రాభవమొప్పగతెల్గునేలపై
కీరితినొందియున్ముదముగీతములెన్నియొయల్లినాడుగా
కారణజన్ముడైధరణికావ్యములద్భుతరీతివ్రాసితా
భూరిగజ్ఞానపీఠమును ,పూర్ణశశాంక"సినారె"పొందెనే!!!

కామెంట్‌లు