తాతయ్య కథలు-71... ఎన్నవెళ్లి రాజమౌళి

 ఏనుగు వెళ్ళింది. తోక చిక్కింది. ఎటు అయితే ఏముంది రా. మీరు చల్లగా ఉండాలి. అన్న తాతయ్య తో-
ఆ మాట ఎందుకు తాతయ్య. అందరూ బాగుండాలి కదా!
పొద్దుపొడుపు కాడ ఉన్న మీరు, పొద్దుగూకుడుకాడ ఉన్న నేను ఒకటేనా రా.
అది నిజమే అనుకో.. కానీ, ఏనుగు వెళ్ళింది. తోక చిక్కింది అంటే ఏమిటి తాతయ్య.నా వయస్సు ఇప్పుడు 80 ఏళ్ళు. ఏమైనా సరే. అయితే... నేను చెప్పిన సామెత ఏమిటి అంటే... ఎక్కువ భాగం జీవితం ముగిసింది. మిగిలింది తోక భాగం. అది బయటకు వచ్చినా సరే, లేక తోకతెగినాసరే. ఈ సామెత ఏ సందర్భంలో వాడతారు తాతయ్య
ఏనుగు శరీరం పెద్ద కాయం అంత పెద్ద కాయం బయట పడ్డప్పుడు..తోక బయట పడదా.. లేకుంటే..ఆతోక ఎటు అయినా సరే ఎక్కువ సమస్యల నుండి బయటపడ్డ అప్పుడు కూడా వాడతారు. చిన్న సమస్యలు వచ్చినప్పుడు.. ఇదో సమస్య నాని, బాగుంది తాతయ్య అన్నాడు మనవడు..

కామెంట్‌లు