తాతయ్య కథలు-75.. ఎన్నవెళ్లి రాజమౌళి

 నానమ్మ! మీ అమ్మగారు బంధువులు అంత ఎక్కువ ఉన్నారా.. తాతయ్య దిక్కు వాళ్ళు తక్కువ అని అంటున్నావు.
అవును రా మనవడా... నాకు ముగ్గురు అన్నయ్యలు. నలుగురు అక్కలు తెలుసా.
అవునవును. నీది  కాకి బలగం. కాదా మరి?
నేను అవును అని అంటున్నాగా అని తాతయ్య అనగానే-
మధ్య మీరు ఎందుకు కొట్లాడు తారు. అసలు ఈ కాకి బలగం అంటే ఏమిటి తాతయ్య.
కాకి ఏదైనా తినే పదార్థం దొరికితే... కావు.. కావు.. అని  అరుస్తుంది.
ఆ కాకి అరుపుకు ఎక్కడి నుండి ఎక్కడినుండో కాకులు వస్తాయి. అన్ని కాకులు కలిసి తింటాయి.
అందుకే నా తాతయ్య. ఈ కాకి బలగం అనే నానుడి వచ్చింది. అవున్రా అన్నాడు తాతయ్య.