ఒరే మనిషి...:-శ్రీతరం బింగి శ్రీకాంత్-కొప్పునూర్ వనపర్తి7893613015

మతం ముసుగులో మారణహోమం చేస్తూ
దాని అభిమతం జనహింత
అసలు తత్వం మానవత్వం అని మరిచి
స్వేచ్ఛా జీవికి మత్తెక్కించి
మకిలి పట్టించి,గీతలు గీసింది నువ్వే కదా

స్వార్థంతో పూటకో రంగు అద్దుకొని
మాటలతో మలుపుకుని
మతమాజ్యం పోసి లేని నిప్పు
రగిలించి ఓట్లు దండుకుంటూ...

లేని పోని సరిహద్దు కంచెలు నాటి
ఉగ్రవాది లోకాన తూటాల వర్షం కురిపించి
రక్తపుటేరులు పారించింది నువ్వే కదరా...
ఒరే మనిషి మరి ఆ దేవునికి 
ఎందుకు అంటించి అపవిత్రం చేస్తావురా...

ఎర్రగా ఉదయించే సూర్యుడు
చల్లని వెన్నెల, పంచభూతాలు సైతం
నీలాగే అనుకుంటే 
సకలచరచర జీవకోటి మనుగడ
సాధ్యమేనారా ఒరే మనిషి.


అందుకే గరళాన్ని వదిలి పలుకు సరళం 
మనుషులంతా ఒక్కటే,సారమంతా స్వచ్చతే 
అని గురుతర బాధ్యత ఎరిగి
మత‌సామరస్యమే జీవన విధానమని
విశ్వమంతా చాటి చెప్పాలి.




కామెంట్‌లు