అష్ట మూర్తులు:జీ వ రూ పు డు - పశుపతి (8) "శంకర ప్రియ.," శీ ల.,సంచార వాణి:. 99127 67098

 👌జీవ రూపుడు శివుడు
      ఆహి తాగ్ని, సోముడు
      అ నీశ్వరుడు, పశు పతి
             ఓ తెలుగు బాల!
   
👌పరమేశ్వరుడు.. పంచ మహా భూతము లలో.. ఎనిమిదవ రూపంలో విరాజిల్లు చున్నాడు."పశు పతి" నామము తో వ్యవహరింప బడు చున్నాడు.
👌 సాంబ శివుడు.. బ్రహ్మాది దేవతలు, మరియు పిపీలికాది సమస్త జీవ రాశికి ప్రభువు. ఉమా సమేతుడైన మహేశ్వరుడు. శక్తి యుతుడైన శివుడు.కనుక, "సోముడు". తన కన్న భిన్నుడైన, మరియొక ఈశ్వరుడు లేనివాడు. కనుక, "అనీశ్వరుడు". సమస్త ప్రాణి కోటికి ప్రాణ నాథుడు... శివుడు.
👌 "పశు పతి" అనగా.. చరాచర జీవులకు; జ్ఞానులకు, విజ్ఞానులకు, మరియు సామాన్యులకు, అజ్ఞానులకు... పరి పాలకుడు. సంసార పాశ బద్దులైన జీవులందరి సంసార బంధములను తొలగించు వాడు కనుక "పాశ విమోచకుడు". జీవులందరిలో నున్న జీవాత్మ. ఆహితాగ్ని స్వరూపుడు. యజమాని, దీక్షితుడు. సర్వ లోక ప్రజాపతి. కనుక, "పశు పతి"... అష్ట మూర్తు లలో ఎనిమిదవ వాడు.
           * * * * *
        ( శ్రీ ఉమా మహేశ్వరు డే... అష్ట మూర్తి యైన జగ దీశ్వరుడు. అందు వలన, ఆగమ వేత్త లైన అర్చక స్వాము లందరు; "నిత్యార్చనా విధి" లో శ్రీ మహా శివ లింగ మూర్తి యైన స్వామి వారిని.. "ఓమ్ పశు పతయే, జీవ మూర్తయే నమః"! అని, పత్రములు, పుష్పము లతో పూజించు చున్నారు! )
కామెంట్‌లు