ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 297 199
గప్పట్ల
ఆయిటి పూనంగనే
ఆనలు మూడు, నాలుగు దినాలు ఆగకుంట 
ఇసిరిసిరి కొట్టేటివి.
గెరువు కాంగనే
ఎవుసం పనులు సురువయ్యేటివి.
పొలాలు దున్నుడు,
అడ్లు వోసుడు
పెరండ్లు దున్నుడు,
మక్కలేసుడు
రాగల్లు  దున్నుడు,
మిరుప నారు వోసుడు,
పత్తేసుడు సేసేటోల్లు.
 
ఆన కాలంల 
మొదాలు అచ్చే పండుగు
' ఆకాశి ' పండుగు.
గీ పండుక్కు అందరూ
శేగోడీలు సేసుకునేటోల్లం.
కోమట్లు గిట్ల 
పాశం సేసుకునేటోల్లు.
కోమటి నాగబూశం దుకాన్లకు
సెక్కరి గోలీలనో, 
సిన్న బిసికిట్లనో,  బిసికిట్ల పూడనో,రస గుల్లలనో
మైసూర్ పాక్ నో,తొండ గుడ్లనో కొనుక్కోను వోతే 
నాగబూశం పెండ్లాం
అనసూయవ్వ
మోతుకాకు దొప్పల 
కొద్దిగ పాశం పెట్టేది .
గా పాశం కొద్దిగైనా 
కమ్మగా తియ్యగా ఉండేది.
శేగోడీలు గుడ కర్ర కర్ర నములుతూ తింటుంటే
కమ్మగా ఉండేటివి. 

ఆకాశి పండుక్కు మాకు
బడి బందు ఉండేది.
పండుగు తెల్లారి
బడికి పోయేటప్పుడు
లాగు కీసల పిరికెడో,
రెండు పిరికిల్లో శేగోడీలను
ఏసుకోని తినుకుంట అన్మశ్పట  బడికి  
మా మల్లారం నుంచి
నడుసుకుంట పోయేటోల్లం.

బడి పోర గాండ్లము
పండుగులు ఎప్పుడత్తయా అని ఎదురు సూసేటోల్లం.
పండుగులచ్చినా, 
బగ్గ ఆన గొట్టినా బడి బంద్.
బడి బందుంటే 
బగ్గ సంబుర పడేటోల్లం.
ఔ మల్ల!