పాట
పల్లవి:-
అడిగి అడగకముందే అన్నీయిచ్చిన అమ్మేరా దేశమంటే..
తెలిసితెలియక చేసిన తప్పుల్ని మన్నించే తల్లిర దేశమంటే ..
కో"" ఈ దేశం మనదే ఈ దేశం మందే మనదే మనదే దేశం మనదే...""పల్లవి""
చరణం:-1
పరహితము కోరినదేశం పంచామృతము పంచినదేశం
కులమతాలను కూడపల్కిన దేశం కుటంత్రాలు చేయని దేశం
బహుళ సంపదను బహుకరించిన దేశం భాగ్యోన్నత దేశం
కాంతినిలయమై నిలిచినదేశం ప్రఖండ జ్వాలగా ప్రజ్వరిల్లిన దేశం
ఆ దేవతమూర్తులే నడియాడిన దేశం అపురూప శిల్పాలు వెలసిన దేశం
త్యాగనిరతితో భావస్ఫూర్తితో సాగుతున్నదేశం సంస్కరణదేశం ""కో""పల్లవి""
చరణం2:-
ఖండాలలో అద్వితీయ కళాఖండము దివ్యతరంగము దేశం
సంప్రదాయములో ఉన్నతము సహకార సాయుధము దేశం
మంచి పరిమళ చరితం కలిగినది సస్యశ్యామలం అయినది దేశం
కో""దేశం మనదే దేశం మనదే మనదే మనదే ఈ దేశం 2
దేశమంటే మట్టికాదులే మనుషులనీ...మరువకూ
దేశభక్తిని ఎన్నడూ నీవు వదలకు
తరం మారిన యుగం మారిన మారలేదురా తల్లి ఆచరణా ..
అదేతీరుగా ఉన్నది దేశం నీపై మమతవలన
తెలుసుకో వంచించకు దేశాభివృద్ధిని మరువకు 2
""కో"" పల్లవి""

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి