మూడు రంగుల జెండా :-గాజులనరసింహ-నాగటూరు గ్రామంకర్నూలు జిల్లా9177071129

 భరతజాతి  జెండా  
ఎగురుతుంది  జెండా
గగనతలము నిండ
మూడు రంగుల జెండా  ||
దేశసౌభాగ్యమీ జెండా
అమరవీరుల ఫలమీ జెండా
పింగళి కూర్చిన జెండా 
భరతమాతకు  పసిడిజెండా   ||

అశోకచక్రం  నిలిచిన జెండా
దేశహద్దుల ఎగిరిన జెండా
ప్రఖ్యాతి  గాంచిన జెండా
ప్రశంసలు పొందిన జెండా   ||

దేశానికి  గుర్తు ఈజెండా
ఎన్నో కీర్తులు గడించిన జెండా
భారతావనికి పచ్చతోరణమీ జెండా
అందమైన ఈ జెండా   ||

అందరి గుండెల నిండా
నిండివుంది ఈ జెండా
మువ్వన్నెల ముద్దు జెండా
ముచ్చటైన ఈ జెండా  ||

ఎన్ని కన్నీళ్లు దిగమింగినదో 
ఎంతవేదన  వెలబోసినదో
ఎందరి ఆశల స్వప్నమో
నేడు స్వేచ్ఛగా ఎగురుతుంది
 జెండా  ||


కామెంట్‌లు