గురు పౌర్ణమి సందర్భంగా:-మమత ఐలహైదరాబాద్9247593432

 
కం
గురువై చీకటి బాపెను
గిరివోలె పదింత లెదిగి గిరిధారుండే
వరముగ గీతను జెప్పెను
నరనారాయణుని రూపు నవ్యము మనసా!
కం
గురువే దైవంబిలలో 
గురువుల సన్నిధిన బోధ కురియును సుధలే
తరువుగ శిష్యులమార్చును
మెరుగైన విలువలనొసగి మిత్రత్వముతో
 పేరెంట్స్ డే సందర్భంగా
తే.గీ
తల్లి దండ్రులే సర్వము యెల్లవేళ
కష్ట నష్టాలనోర్చుచు కడవరకును
పిల్లలభివృద్ధి కోరుచు ప్రేమతోడ
కంటి పాపోలె కాచేడి ఘనులువీరు
తే.గీ
తల్లి దండ్రిని మరచుట తగదునిలన
దైవముకు మారు వీరేను ధరణియందు
యెచట నున్నను పిల్లల క్షేమమెరిగి
కూడబెట్టేరు సంపద కూర్మితోడ

కామెంట్‌లు