ఉ.
అప్పులుజేసి కుంపటిని హారతిగా తలపోయబోకుమా
తిప్పలు దెత్తునేననుచు తీరనిరీతి భయంబుపుట్టునే
ముప్పులు దాటలేకనిను ముంచును సర్వముపాపభీతితో
నిప్పుల జాడలైనగని నిక్కము చూపదు యెల్కపండుగన్
ఉ.
సంపదకూరినంత తిన సౌఖ్యముతో తిరుగాడుచుందువే
నింపగు జీవితంబునిడి నేప్పుడు గొప్పలకాశబుట్టునో
కుంపటినందుదూరినటు కూరిమి నంతయుమ్రింగివేయునే
రంపపుకోతగా *భయము* రక్కసి మాదిరశాంతినింపు గన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి