పిల్లలు ఆటలు ఉత్పల మాలలో వర్ణించుట:-మమత ఐలహైదరాబాద్9247593432

 ఉ.
ఆటలు పాతవైనవని యాపులతోవిడియోలగేములన్
ధీటుగ నాడుచున్నగని ధీర దృఢత్వము గానకుంటిమే
చోటెమొ సన్నగిల్లినది శుభ్రత గూడిన పట్టణంబునన్
మాటల పాటవాలుగన మల్లెలుగా వికసించె పిల్లలే
ఉ.
ఆటల యందునృత్యమును నాగక జేతురు నద్భుతంబుగన్
నాటివి నష్టచెమ్మలను నాటల నెన్నడు కానకుండిరే
నేటికి మాసిపోయినవి నింటనె యాడెటి గచ్చకాయలే
కోటికి మిన్న సంపదతొ గూడినవేనివి పిల్లలాటలై
ఉ.
పిల్లల వింతలాటలను పృథ్వినగాంచగ చోద్యమే మరిన్
నల్లని గోపబాలునివినమ్రత మెండగు నాటలేకనన్
చల్లని మాయజాలమును చక్కగ నింపెను సృష్టిలోపలన్
నెల్లరికిష్టమైనగని నిక్కముజెప్పిరితల్లిదగ్గరన్

కామెంట్‌లు