ఆశువులు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 అంశం:- కులమత వర్గ రహిత సమాజం
కం
కులమతములు లేవెప్పుడు
చులకన భావముగ జనుల చూసుట వలనన్
పలువిధ స్పర్థల ధీటుకు
నలువైపుల ముసిరినట్టి నవరోధములే
అంశం:- మహిళా ఔన్నత్యం
కం
చతురత కలిగిన మహిళలు
సతతంబున్నతుల వైపు సాగుట తథ్యమ్
స్థితిగల పురుషులకుసమము
ప్రతి రంగము నందువనిత పరుగులు తీయున్
అంశం:- విశ్వ మానవ సౌబ్రాతృత్వము
కం
కానని సౌబ్రాతృత్వము
మానవ జీవనమునందు మార్గము దప్పెన్
దేనికి కుటిలపు మోసము
వానీ! కనిదీవెనొసగు వరదాయినివై


కామెంట్‌లు