ఆహారం-ఆరోగ్యం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  మనం తినే ఆహారం శక్తినే కాకుండా,మన ఆలోచనల్ని,పనిసామర్థ్యాన్ని,మెదడు చురుకు దనాన్ని మారుస్తుంది.
        ఈ ఆహార విషయాలను శ్రీకృష్ణ భగవానుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం భగవద్గీత పదిహేడవ అధ్యాయం,శ్రద్ధాత్రయ విభాగయోగంలో వివరించాడు.సాత్విక ఆహారం వలన లాభాలు(8వ శ్లోకం)తిన కూడని ఆహార పదార్థాలు(10 వ శ్లోకం) లో వివరించాడు.
        నిజానికి కొన్ని వేల సంవత్సరాలక్రితం మనదేశంలో ఆయుర్వేదం,మేలు చేసే ఆహారపదార్థాలు,పండ్లు మొదలైన వాటిని గురించి వివరించింది.
      ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనలను గురించి చూద్దాం.
        బేకరి బ్రెడ్ అనేక ప్రోటీనులు,కొన్ని రకాల అమినో ఆసిడ్లను మెదడుకు అటదిస్తుంది.తద్వారా 'ట్రిప్టోపాన్' అనే మేలు చేసే రసాయనం మెదడుకు చేరుతుంది.దీనివలన మెదడు ప్రశాంతత పొందుతుంది.మాంసం మొదలైన అతి ప్రోటీనులు గల పదార్థాలు తినేముందు బ్రెడ్ తింటే అందులోని ట్రిప్టోపాన్ ముందరే మెదడుకు చేరి ప్రశాంతత,ఆనందం లభిస్తాయని పరిశోధనల్లో తేలింది.
        అమెరికా సైనిక శాస్త్రజ్ఞుల పరిశోధనల ప్రకారం'చికెన్' లోని టైరోసైన్ అనే అమినో ఆసిడ్ మెదడును ఉత్తేజ పరిచి కార్యసాధనకు పురికొల్పుతుందని తేలింది!ఈ టైరోసైన్  మెదడులోని డోపమైన్ మరియు 'నోరి పైనెఫ్రైన్' పెంచి మెదడును ఉత్తేజ పరుస్తుందని తెలుసుకున్నారు.
        అరటి పండ్లలో మెగ్నీషియం ఉంటుంది.ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.పురుషలకి రోజుకి 350 మి.గ్రా. స్త్రీలకు సుమారు 280మి.గ్రా. అవసరమవుతుంది.
        పనుల వత్తిడితో సతమతమయ్యేవారు మధు మేహులు కాకపోతే కనీసం రోజూ రెండు అరటి పండ్లు తినడం మంచిది.ఆకుకూరలు,బీన్స్ లలోకూడా మెగ్నీషియం ఉంటుంది.
       చేపలు,రొయ్యలు,తిండికి ఉపయోగపడే సముద్రపు నాచుల్లో 'సెలినియం' ఖనిజం ఉంటుంది.
ఈ సెలినియం మెదడుకు ఒక విధమైన సంతోషాన్ని ఇస్తుంది.రోజుకు 100 మైక్రోగాములు చాలు.
        అలసటలో,కొన్ని కారణాలశలన శరీరంలో నీరు తగ్గినపుడు నీరు బాగా తాగాలి.నీరు నిస్సత్తువ పోగొడుతుంది.రోజుకు కనీసం ఎనిమిది పెద్దగ్లాసుల నీళ్ళు తాగాలి.
      నిమ్మజాతి పండ్లు,ద్రాక్ష విటమిన్ సి ని సమకూరుస్తాయి,ఏ కాలంలో వచ్చిన పండ్లు ఆ కాలంలో తింటే మంచిది.విటమిన్ సి వలన శరీరం ఇనుమును గ్రహించ గలుగుతుంది.ఉసిరిక పండ్లలో కూడా విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇనుము సుమారు 100 మి.గ్రా. అవసరం అవుతుంది.అదే చిన్న వయస్సుగల స్త్రీలకు 150 మి.గ్రా. అవసరం అవుతుంది.
      మెంతులు నానబెట్టి తింటే మధుమేహులకు చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధనల్లో నిరూపించింది.
       పచ్చిమిరపలో'కాప్ సాయ్సిన్'(capsaicin) అనే పదార్థం వలన మెదడులో 'ఎండార్ఫిన్'లు విడుదల  అవుతాయి.ఈ పదార్థాలు నొప్పిని ఎదుర్కొంటాయని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ వారి పరిశోధనల్లో తేలింది.
      ఈ కరోనా కాలంలో పండ్లు,చిక్కుళ్ళు,నానబెట్టిన మొలకెత్తిన విత్తనాలు తినండి ఆరోగ్యంగా ఆనందంగా గడపండి.
         ఇంకొక మంచి విషయం.....అల్యూమినియం పాత్రలు వంటకు ఎక్కువగా వాడకూడదు,చింతపండు వంటి పదార్థాలు అల్యూమినియంతో రసాయనిక చర్య జరిగి హాని జరగవచ్చు.
     

కామెంట్‌లు