బోడకాకరకాయ:-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371

 *ఆటవెలది*
వర్షకాలమందు త్వరగాను లభియించు 
బోడకాకరపుడు బూరిగాను 
భోజనమునతినగపోషకాలనిడును
రక్షణిచ్చుమనకు రయముగాను
*ఆటవెలది*
అవనిలోననెపుడు నరుదుగా లభియించు
రుచికరముగనుండు రూఢిగాను
వ్యాధులుతొలగించి హాయినిపెంచుతు
శక్తినిచ్చు నవియు సాదు మెపుడు
*కందం*
సాగగునుబోడకాకర
తీగలవెంబడిపెరుగగ తెంపియువండన్
బాగుగనందరుతినగను
రోగములనుచంపునెపుడు లోకమునందున్