పద్యాలు :--బెజుగాం శ్రీజ--ట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371

 1. *చంపకమాల*
చదువులుసంధ్యరాకయును
జ్ఞానమెరుంగని కోడలప్పుడున్
సదనములోనవంటయును
సాకులు జెప్పుచు జేయరాదనెన్
ఉదరము ఖాళి గుండనిట-
నోర్పగజూడ నుపాసముందురే
కదనమె యత్తజేసియిక
గట్టిచివాట్లను పెట్టెనప్పుడున్
2.తేటగీతి
కాకికిన్ శక్తిలేకను కదలకున్న
గద్దతనమీదనెక్కించి కదులుచుండె
యాపదను రాగజూసియు నాశతోడ
సాయమేజేయు తొందర సద్వివేకి.

కామెంట్‌లు