*సీసమాలిక*
విశ్వనాధుడుభువనేశ్వరీగారలున్
కలసిమెలసివుండెకాపురమున
వారలకున్ గర్భవాసమందుదయించె
నానరేంద్రానాథుడరయగాను
ఆటలో,చదువులోనన్నింటిలోతాను
ఏకసంథాగ్రాహినెంచిచూడ
జ్ఞాపకశక్తితోజగములనన్నింటి
మేలుకొల్పెనతడు మేథ గలిగి
భారతదేశమేభావితరాలలో
గొప్పతనముచాటుకోర్కెతోడు
శ్రీరామకృష్ణులచెంతకు జేరుచు
శిష్యునిగామారెశీఘ్రముగను
హిందూమతమ్మునహైందవజీవన
మ్ముగురించిపోరాడెమోదమలర
ఏకాగ్రతామదినెప్పుడు నిల్పుచు
శ్రద్ధను పెంచెను చక్కగాను
మంచినిబోధించెమనసారసతతము
వెలుగుల నింపెనువీరునిగను
*తేటగీతి*
నీతివాక్యాల సారాన్ని ఖ్యాతి మీర
యువతలోస్పూర్తినింపెతానుద్యమముగ
దేశ భక్తిని పంచె విదేశములకు
పిన్న వయసున నాకమున్ గన్న మూర్తి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి