ఆత్మస్థైర్యం.
రచన తాటి కోల పద్మావతి గుంటూరు..
దేహంలో లోపాలున్నా
శరీరం సహకరించకపోయినా
కన్నీళ్లు వచ్చినా దిగమింగుకుంటం.
అవయవాలన్ని నిందించ లేము కదా.
కష్టాలు కమ్ముకు వచ్చిన
పరిస్థితులు తలకిందులైన
నా అదృష్టం బాగాలేదని
సరి పెట్టుకుంటాం కానీ
బ్రతుకు మీద ఆశ వదులుకోలేము కదా
పెంచుకున్న బంధాలు
దూరమై పోతున్న పంచుకున్న
రత్నం విడిపోయినా నా తోడు లేక పోయినా
ఒంటరితనాన్ని నిందించ లేము కదా.
చెమట చుక్కల తో పండించిన
పంటంతా వర్షాలకు కొట్టుకుపోతే
ప్రాప్తి లేదని బాధ పడతారు
కానీ పంట వేయటం మానుకో లేము కదా.
అమ్మ కొట్టిందా అని నాన్న తిట్టాడని
అలిగి కన్న వాళ్ళని బాధ పెడతాను గాని
మన మంచి కోసమే చెప్పాలని ఆలోచించలేదు కదా.
ఆత్మకు మించి నా పరమాత్మగా అనుకుంటాం
జీవితం రేపటి తరానికి ఆలస్యం
కావాలని ఆత్మస్థైర్యం ఉంటే
అన్ని అందుకోగలరని ఆశిస్తాం
గాని నిరాశా నిస్పృహలతో కుంగి పోలేదు కదా.
కాలచక్రం ఆగదని తెలిసిన
నిత్య కార్యక్రమాలు యధావిధిగా సాగిపోతూనే ఉంటాయి.
వర్తమానపు పరుగులతో అలసిపోయిన
మోయలేని బరువు బాధ్యతలు మోసుకుంటూ
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి పోవటమే మన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి