మన సాహిత్య శిఖరం:-గుర్రాల లక్ష్మారెడ్డి.కల్వకుర్తి. నిజామాబాద్ జిల్లా.సెల్ నెంబర్...9491387977.
శ్రీకాకుళం సాహిత్య శిఖరం
బలివాడ ముంజేతి మఖురం
పుట్టిందిమన మడపాం గ్రామం 
బ్రిటిష్ వారితో చేసే సంగ్రామం !

పూర్తి పేరు బలివాడ కాంతారావు
సాహిత్యంలో ఎక్కని ఎత్తుపల్లాలు లేవు
కథలు, నవలలు, రేడియో నాటికలు
చక్కగాను వ్రాశాడు  వాటికి ప్రాణం పోశాడు !

ఆయనచేసిన రచనలన్నీ అమోఘం
అవి మధ్యతరగతి వారి సరాగం
చదివినా మళ్ళీ చదవాలనిపిస్తాయి
సాహిత్యంలో అగ్రస్థానంలో నిలుస్తాయి !

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం
కళాసాగర్ గోపీచంద్ అవార్డు
సాహితీ రంగ మందు పొందెనులే రివార్డు !

ద్వి శతాధిక రచనలను తాను అందించే
అద్వితీయ ఆనందంలో మనల ముంచే
అందుకున్నాడు కోకొల్లల పురస్కారాలు
అందుకే అందిద్దాం ఆయనకు మన నమస్కారాలు