బాలమేధావి.:- గుర్రాల లక్ష్మారెడ్డి--సెల్ నెంబర్...........9491387977
చదవడానికి ఎందుకురా తొందర
ఎదగడానికి చూసుకోరా ముందర
చదువుపై ధ్యాస బాగా నీవు పెట్టు
చదువుపైన కొనసాగలిక నీ పట్టు !

చిట్టిపొట్టి గట్టి జెగజెట్టి ఈ చిట్టి 
పట్టుబట్టి పుస్తకం తనచేతబట్టి
గడగడ తాను చదివేస్తున్నడు
గడబిడ లేకుండా మస్తుగున్నడు !

చదువులమ్మ ఒడిలోన ఎంచక్కా
ఎదుగుతున్న పసి ఈ పూల మొక్క
ఆసాంతం అజ్ఞానాన్ని తొలగిస్తుంది
విశ్వమంత విజ్ఞానాన్ని కలిగిస్తుంది!

పువ్వుపుట్టగనే పరిమళిస్తుందంట
నవ్వుల పిల్లోడిని చూస్తుంటే నంట
భవిష్యత్తు బాలమేధావి ఇతడంట
భవిష్యవాణి చెప్పే బ్రహ్మ జ్ఞానంట !

తాను నిత్యం చదువుతుంటడు
కను సత్యంకై వెతుకుతుంటడు
చదువుల గుట్టు విప్పుతుంటడు
పదవుల మెట్టు ఎక్కుతుంటడు!