మాయమ్మ:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.

 కమ్మని కథలను చెప్పును మాయమ్మ
వద్దన్న ముద్దులు ఇచ్చును ఈ అమ్మ
నవ్వులు పువ్వులు పూయించేపూలకొమ్మ
వారానికి ఓ కొత్త కథను తాను వినిపిస్తుంది
హితవు చెప్పుతూ మమ్ముల మందలిస్తుంది
నిజాలు ఇజాలను నిత్యం అందిస్తుంది
తెలుసుకొని మేం ఉండాలని సెలవిస్తుంది
లుప్తంగా గుప్తంగా వెంటనే వల వేస్తుంది
గుసగుసల గులగులలను నిలిపేస్తుంది
వెలవెలబోకుండా ఆనందంలో కలిపేస్తుంది వె
లుగు పూల దారిలోనే మమ్ముల నడిపిస్తుంది
ఉమ్మడి పూలమాలలేసి మమ్ముల మురిపిస్తుంది !