ఋవ్వ లేని అవ్వ:--గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

అవ్వ ఈ అవ్వ 
బువ్వ లేని అవ్వ
గూడు లేని అవ్వ
తోడులేని అవ్వ

అవ్వ ఈ ముసలవ్వ
తోడు నీడ కోల్పోయిన
అతి గతి తప్పోయిన
సుతి మతిలేని అవ్వ !

బజారు పాలైన అవ్వ
బేజారు అయిన అవ్వ
దగాపడిన ఈ అవ్వ
దిగాలు తో ఉన్న అవ్వ !

అవ్వ ఈ అవ్వ
బువ్వ లేని అవ్వ
దిక్కులేని అవ్వ
సొక్కి సోలిన అవ్వ !

మీ మెరిగిన ఈ అవ్వ
మంచిగా బతికిన అవ్వ
ముగ్గురు కొడుకుల అవ్వ
తప్పింది ఎందుకో తొవ్వ !

ఒకడేమో డాక్టరు
మరొకడేమో యాక్టర్
ఇంకొకడేమో కండక్టర్ 
ఈ అవ్వమొ విక్టర్ !

ఈ ముగ్గురు కొడుకుల అవ్వ
మూడు దారుల కూడలి లో
బువ్వ కై అల్లాడుతున్న అవ్వ
బిచ్చగత్తె అయిన ఈ అవ్వ !

కూడులేకున్నా ఈ అవ్వ
కొడుకులపై కలవరింత
కన్న కడుపు పలవరింత
తీర్చేదెవరు ఈఅవ్వ చింత !

కామెంట్‌లు