ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా
మా మంచీ బుజ్జమ్మా
నాన్న కొనేటి గొంగడికి
అమ్మ వెళ్ళెను అంగడికి
ఓబుజ్జమ్మా బుజ్జమ్మా
మా ముద్దుల బుజ్జమ్మా
అల్లరి అసలే చేయొద్దు
కల్లోలం నీవు రేపొద్దు !
ఓబుజ్జమ్మా బుజ్జమ్మా
బజ్జుకుంటే ముద్దమ్మా
పాడుతాం నీకు జోల
కడతాంలే ఓ ఉయ్యాల !
ఓబుజ్జమ్మా బుజ్జమ్మా
ఉజ్జాయింపుగ ఉండమ్మా
చిందర వందర చేయకమ్మా
సుందర వదనం నీదేకదమ్మా !
ఓబుజ్జమ్మా బుజ్జమ్మా
గజ్జెల గుర్రం నీవమ్మా
ఆకాశంలో విహరిస్తావు
ఆశ దోశ అని ఊరిస్తావు !
ఓబుజ్జమ్మా బుజ్జమ్మా
బుజబుజ రేకుల బుజ్జమ్మా
బజ్జుకునే తినేసిటి గుజ్జమ్మా
తినేసి నీవింకా బజ్జోమ్మా !
ఓబుజ్జమ్మా బుజ్జమ్మా
గుజ్జనగూళ్ళ బుజ్జమ్మా
అమ్మా నాన్న వచ్చారు
పలకాబలపం తెచ్చారు !
ఓబుజ్జమ్మా బుజ్జమ్మా
మా బూర్గుల బుజ్జమ్మా
దైవం పూజ చేయ్యమ్మా
వైనం నైవేద్యం ఇవ్వమ్మా !
ఓబుజ్జమ్మా బుజ్జమ్మా
అంబుజ రేకుల బుజ్జమ్మా
జమలక పంబవు నీవమ్మా
నీ ముందర మేమెంతమ్మా !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి