జగమెరిగిన జగదభిరాముడుజన మనందరి మనసెరిగినవాడుజానకి మాత ను మనువాడిన రేడుజగమంతా కొలువైయున్న వాడు.!సుందరస్వరూపం మృదు స్వభావంఇలా కలిగి వెలిగిన కళ్యాణ రాముడుకష్టనష్టాలను ఎదుర్కొన్న పరంధాముడుఇష్ట సఖులను ఆదుకున్న ఆదర్శ రాముడుజగద్రక్షకుడై నిలిచిన వాడుజగదభిరాముడై గెలిచినవాడులోకానికి ఆదర్శం శ్రీరాముడుశోకానికి నిదర్శనం ఈ సోముడు!విష్ణువే శ్రీరామునిగా ఇల జన్మించేవైష్ణవ మాయను తాను జయించేఆదర్శ మార్గాన్ని మనకు చూపించేనిదర్శనమై నిలిచి మానల దీవించేవసంత రుతువు చైత్ర శుద్ధ నవమి నాడు పుట్టాడుసీతా సమేతుడై అయోధ్యలో కాలు పెట్టాడుపట్టాభిషిక్తుడై అయోధ్యను పరిపాలించేప్రజల కష్టసుఖాలే తన ధ్యేయమని భావించేఈ మహనీయుని జన్మదినం మనంపండుగగా జరుపుకుంటాంసీతారాముల కళ్యాణాన్ని కన్నులపండుగగా తీర్చిదిద్దుకుంటాంకలసి మెలసి అంతాసంబరాలు చేసుకుంటాంఆ ఆదర్శ దంపతులు తలంబ్రాలుమన తల పైన పోసుకుంటాం...............
శ్రీరామ జననం:-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977నాగర్ కర్నూల్ జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి