*వ్యక్తిగత విలువలు - అభ్యున్నతికి దోహదం*:-*రచయిత పేరు: యడ్ల శ్రీనివాసరావు* విజయనగరం-చరవాణి: 9493707592

 మనిషికి విలువ అతని వ్యక్తిత్వం 
దురాగతాలను దూరం చేసే మనస్తత్వం ఏకలవ్యుడి మనస్తత్వం 
శ్రీరాముని మనస్తత్వం శ్రీకృష్ణుని మనస్తత్వం హరిశ్చంద్రుడు మనస్తత్వం 
వ్యక్తులుగా వారి అభ్యున్నతి 
ఛాందసత్వానికి దూరంచేసే 
మహాత్మా గాంధీ ,
రాజా రామ్మోహన్ రాయ్ ,
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ,
కందుకూరి వీరేశలింగం ,
వారు నడయాడిన పవిత్ర నేల మనస్తత్వం 
అదే జీవితం
ఉన్నత  శిఖరాల సౌరభం 
రాజుల కాలంలో తీరు ప్రజల ప్రజాస్వామ్యంలో పోరు 
తలచుకుంటే మనుషుల మనస్తత్వం 
చిన్న నవ్వేసింది తెలుసుకో మానవుడా ఇదే మన జీవితం
ఇదే మన మూర్తిమత్వం
ఇదే మన వ్యక్తిత్వ వికాసం