భారతీయుణ్ణి:-- సామల కిరణ్ (సాకి)-- పద్యకవి, రచయిత--కరీంనగర్,9949394688

 నేను భారతీయుణ్ణి-విశ్వ బంధువుని
సత్యసనాతన ధర్మవారసుడిని
నేను భారతీయుణ్ణి-సుగుణజల సింధువుని
శాంతికాముక సమర వారసుడిని
నేను భారతీయుణ్ణి-ప్రకృతి ఆరాధకుణ్ణి
ఘనమాతృ సంస్కృతి వారసుడిని
నేను భారతీయుణ్ణి -సృష్ఠిరహస్యకుడిని
శాస్త్ర విజ్ఞాన చరిత్ర వారసుడిని
నేను భారతీయుణ్ణి -సౌబ్రాతృత్వ వారధిని
సామరస్య యోగ వారసుడిని
నేను భారతీయుణ్ణి-ఆధునికతపు ఆర్యుడ్ని
ప్రాచీనతత్వమూల వారసుడిని
నేను భారతీయుణ్ణి-ఏకతా మంత్ర సారథిని
విశ్వకుటుంబ విలువల వారసుడిని
నేను భారతీయుణ్ణి-మార్పుకు మారుపేరుని
మానవత్వ సందేశ వారసుడిని