" నిజాల సరాలు "-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,సెల్:9966414580
మనిషిలో చూడాలి
ప్రేమలొలికే గుణము
మనసులో వీడాలి
తప్పులు వెదకు గుణము

చేయూత నివ్వాలి
నష్టాల ఊబిలో
అండగా నిలవాలి
కష్టాల కడలిలో

స్నేహాన్ని పంచాలి
ప్రాణముండే వరకు
ద్వేషాన్ని వదలాలి
జయము బ్రతుకున మనకు

క్షేమమే కోరాలి
అనునిత్యం మదిలో
దీపమై వెలుగాలి
జీవితాన మహిలో


కామెంట్‌లు