ఆ.వె...వింత తిండి దిని విచ్చల విడిగాను
వింత పోకడలును విషపు రీతి
చైన దేశ ప్రజల చావు తెలివివల్ల
కలత రోగమొచ్చె కలియుగాన
సీ...పరిశుభ్ర ప్రార్థన పాటించి జగమంత
చెడు నలవాట్లకు చేఱువవక
దగ్గిన తుమ్మిన దస్తినడ్డము బెట్టి
సామాజికముగాను సన్యసించి
కరచాలనంబులన్ కలుపుటనాపిరి
వందనమనుచుండ్రి వాసిగాను
సదనంబునేయిప్డు స్వర్గంగ భావించి
గడపదాటకెవరు కదలకుండ్రి
ఆ.వె...పండ్లు బాగ తింటు పరిపుష్టనొందుతు
కూరగాయలందు కోరికెచ్చె
పబ్బు సంస్క్రతంత గబ్బుగా భావించి
యింటి తిండి యన్న యింపు పెరిగె
ఆ.వె...వ్యాధినబడువార్కి వైద్యుల సేవలు
రక్షకభటులేమొ రక్ష ప్రజకు
పారిశుద్ధులేమొ పరిశుభ్రతకు రక్ష
వేల వందనములు వేల్పులార
ఆ.వె...తరిమి వేయ వలెను దలచికరోనాను
లాకు డౌను నెఱిగి లౌక్యముగను
కట్టు దిట్టమైన కర్ఫ్యూను బాటించి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి