పిచ్చుక గూడు(బాల గేయం)బొమ్ము విమల -మల్కాజ్ గిరి,9989775161

తుమ్మ చెట్టు కొమ్మన
పిచ్చుక గూడు కట్టెను
గూటిలోన గుడ్లు పెట్టి
పొదుగుతూ ఉండెను

పొదిగిన గుడ్డు పొడవగ
పిల్ల బయటికి వచ్చెను
కళ్ళు తెరచి చూస్తూ
కిచ కిచ మని అరిచెను

తల్లి పిట్ట చూసేను
పిల్ల ఒళ్ళు నిమిరెను
తల్లి రెక్కల చాటున
కదులుతూ ఉండెన...

తల్లి గింజలు తెచ్చి
పిల్ల నోట్లో వేసేను
మెల్లగ పిచ్చుక మింగెను
రెక్కలు  విప్పి ఆడెను
కామెంట్‌లు