**కరోనా మీద పేరడీ పాట**(సుఖ దుఃఖాలు సినిమా లోనిది):- తొగర్ల సురేష్ASI Police

 ఇది మల్లెల మాల వేళ యనీ
ఇది వైరసుల మాసమనీ
తొందర పడి ఒక కరోనా
ముందే వచ్చిందీ చిందులు వేసిందీ
కసిరే ఎండలు కాల్చుననీ
ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఎండలు కాల్చునని
మరి ముసిరే వానలు ముంచునని
ఎరగని కరోనా ఎగిరిందీ...
ఎరగని కరోన ఎగిరింది
కొత్త రెక్కలతో నింగికి ఎగిరింది
నేలకు వచ్చిందీ..."ఇది మల్లెల"
మరువలేనిది మానవ హృదయం
కరోనా కలిగించె తీరని శోకం
అదే ఎదురై మనకు శాపమై
కలిగించెను విషాదమూ
కలిగెను మనిషికి ప్రాణ సంకటం"ఇది మల్లెల"
ద్వారానికి లోపలుంటేనే మేలు
అదే మనకు శ్రేయస్కరం
స్వచ్ఛమైన గాలి లేని సీమలో
స్వచ్ఛమైన గాలి లేని సీమలో
విజృంభించెనులే కరోనా"ఇది మల్లెల"......               
ఓ..ఓ ...ఓహోహో..
             

కామెంట్‌లు