సర్వాంగాలు లక్షణంగా ఉన్న మనం లక్ష్యం లేని దిశలో సాగి నిర్లక్ష్యంగా బతుకుతాం.కానీ దివ్యాంగులు తమ ప్రతిభా పాటవాలతో దూసుకుపోతున్నారు. ఈనాడు మీడియా వల్ల వారు అందరికీ తెలుస్తున్నారు. కానీ పుట్టుక తోటే కనుచూపు కరువైన ఆ కంప్యూటర్ గణిత బ్రహ్మ పేరు వినం.తెలుగు తేజం ఆరువేల గణిత అవధానాలు చేసిన ఒకేఒక్క తెలుగు మాణిక్యం శ్రీ లక్కోజు సంజీవరాయశర్మ గారు. 27నవంబర్1907లో ఆనాటి కడపజిల్లా కల్లూరులో పుట్టాడు. అమ్మా నాన్న నాగమాంబ పెద్దపుల్లయ్య. పుట్టుకతో అంధుడైన ఆబాలుని మేధ అపూర్వం. బ్రెయిలీలిపి తెలీదు మనకు.అక్క బడి పాఠాలు పెద్దగా చదువుతుంటే శర్మ వినేవాడు.తండ్రి మరణం తో అండదండలు లేకున్నా ఆయన తల్లి ఆపిల్లాడిని కంటి పాప లా సాకింది. పువ్వు పుట్టగానే పరిమళించింది. తన ఊరి రైతుల కు టకటకా ధాన్యం ధరలు లెక్క వేసి చెప్పేవాడు. భూమి కొలతలు లెక్క చెప్పేవాడు అంటే నమ్మబుద్ది కాదుగదూ?కాలక్షేపానికి వైలెన్ నేర్చుకున్నాడు.1928లో తొలిసారి గణిత అవధానం చేసిన ఆయన1995దాకా భారత దేశం లోని అన్ని నగరాలలో గణిత అవధానాలు చేసిన సంగతి మనకు తెలీదు. 1928నవంబర్ 15న అఖిలభారత కాంగ్రెస్ మహా సభలు నంద్యాలలో జరిగితే శర్మ గారి గణిత అవధానం ఆనాటి జాతీయ నాయకులను అలరించినది.పుట్టిన తేది వారంతోపాటు ఆరోజు పంచాంగం చకచకచెప్తుంటే జనం అబ్బురపడ్డారు.1966డిసెంబర్ 7న హైదరాబాద్ శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో 2 పవర్ 103 కి 32సంఖ్యలున్న జవాబు ఈయన టక్కున చెప్పి తే మిగతావారు పేపర్ పై లెక్కలేస్తూ తికమక లోనే ఉన్నారు అంటే నమ్మబుద్ది కాదు. అంకె సంఖ్య ఎలా ఉంటుందో తెలీదు. అంతావినికిడి. ఆనాటి మనరాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తో సహా ఈవిషయంతెలుసుకుని ప్రశంసలు కురిపించారు.బాబూ రాజేంద్ర ప్రసాద్ డబ్బుని ఎం.ఓ.చేశారు ఈమేధావికి!కాశీనాధునినాగేశ్వరరావు శకుంతలాదేవితో సహా సెభాష్ అన్నారు. ఎన్నో యూనివర్సిటీలలో లైబ్రరీలలో గణిత అవధానాలు చేశారు. కానీ దైవ సహాయం లభించలేదు. 1993లోఅమెరికాతెలుగు సంఘాలు ఆహ్వానించాయి.కానీ వీసా సమయానికి అందక వెళ్లలేకపోటం విధిరాతకదూ?రైలు ప్రయాణం లో ఆయనకు లభించిన 14బంగారు పతకాలున్న సూట్ కేసు ని దొంగలు కాజేశారు.మరి దురదృష్టం ఆయనవెంట ఉంది. ఆఖరి రోజులలో శ్రీ కాళహస్తి స్వామి సన్నిధిలో వైలెన్ వాయిస్తూ గడిపారు. 1997 డిసెంబర్ 2 న అస్తమించారు.అంకవిద్యాసాగర విశ్వసాంఖ్యాచార్య బిరుదులు పొందారు. మరి ఆయనని గూర్చి ఎందుకు ప్ర చారం జరగలేదు? కనీసం క్విజ్ వ్యాసరచన ఈయన జయంతి వర్ధంతి మనం ఎందుకు జరపం?తెలుగు వాడు కావటం శాపమా?దైవంతో పాటు ప్రజలు ప్రభుత్వం ఆదరించకపోటం నిజంగా ఆయనపట్ల అపచారమే అవుతుంది. ఇప్పటికైనా ఆయన పేరుని తల్చుకుంటూ నివాళి అర్పిద్దాము.లాప్ టాప్ కంప్యూటర్ తో ఎక్కాలు రావు విద్యార్ధులకి. మెదడు ఆలోచనాశక్తిని గుర్తు ఉంచుకునే శక్తి ని కోల్పోతోంది. మరి ప్రాణమున్న రోబోట్ లా తయారు అవుతున్నాము.శర్మ గారి తల్లి లో ఉన్న ఓపిక సహనం మనకున్నదా?పిల్లలని టి.వి.స్మార్ట్ ఫోన్ కి అప్పచెప్పుతున్న కాలంలో ఉన్నాము మరి!?
మరుగైన మాణిక్యం! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి