మేఘం చెమట కారుస్తుందా
నీరును కారుస్తుంది !?
మంచు కండ కరిగిస్తుందా
కొండ ను కరిగిస్తుంది !?
చెమట ఇప్పుడు చవట
చెట్టులా ఎదగాలి
చెమట కార్చకుండా నే !?
అగ్గిపెట్టె చెమట కార్చకుండా నే
కాల్చుతుందీ !!
చేతిలోని సెల్ఫోన్ చేతగాని ది కాదు
చేతనైన వాని కోసం చేతగాని వాని కోసం
శ్రమ సౌందర్యం కాదు
విశ్రాంతి లేని విశ్వసుందరి !?
చెమట కార్చకుండా నే నిరంతరం తిరుగుతున్న
గడియారం బంగారాన్ని సృష్టిస్తుంది!?
కాళ్లు చేతులు ఆడకుండానే
కంప్యూటర్ కాలంతో పోటీ పడుతుంది !!
ఒకప్పటి మనిషి ఒట్టి పని మనిషి
అంతకు మించి మంచి మనిషి !?
నీవు శ్రమించలేదని తలవంచకు
ధనం పంచే వరకు
ఉన్న విజ్ఞానం అందరికీ పంచు !?
Sunitapratap
Teacher palem
8309529273

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి