కఠినకరోన_సరళ గున్నాల

కం*రోగమ్మొక్కటిజేరెను
సాగిలబడెజీవితాలు సాగక పనులున్
నాగమూజేసెగ బ్రతుకులు
వేగమ్ముమడియ కరోన వేడుకమిగులున్

మ*బడులున్మూసినపిల్లలెల్ల
చదువుల్ పాడయ్యిపోసాగ నీ
తడవున్మాడినపాఠశాలదెరువన్ తండోపతండమ్ముగన్
విడనీరోగముసంరమ్ముననుచున్ విద్యార్థులేతెంచగన్
గడుచున్రోజులు,శోభగూర్చునిపుడున్ కార్యమ్ముయేసాగగా
ఆ.వె*చైనదేశమందు జైకొట్టినిటుజేరి
చంపుచుంటివేల జనులనెల్ల
పుట్టినిల్లుజేర పోవమ్మ పరుగున
వందవందనముల నందజేతు

కం*కూలిన్జేయగ దొరకదు
మేలున్జేయంగరారు మిడుకుట మిగులన్
తేలన్బోయితి జలమున
కాలమ్మేదీరిపోయె కఠినకరోనా

కం*ఆలున్పిల్లల వీడితి
నేలగనాతరముగాక, నెటులుండెదరో
బేలగ బ్రతుకుట గగనము
చేలుగ నెటులుండెదవిట చేరుము చైనా


కామెంట్‌లు