*విశేషం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.మంత్రివర్గంలో ఉన్నతి!
   కనీసం చోటు ఉన్నది!
   పడితే మరి  ఓ వేటు!
   మారుతుంది ఆ రూటు!
2.ఏవి ఆగుతున్నాయి!
   జననాలు! మరణాలు!
   కొత్తపార్టీల ఆవిర్భావాలు!
 పాతవి మరింత బలోపేతాలు!
 వ్యాపారాలు! వ్యవహారాలు! 
మంతనాలు నిత్యనూతనాలు!
జీవనం కాలపురోగమనమే!
3. నీబతుకంతా,
             బంగారునాణాలే!
నిన్నుకొత్తకార్లు రమ్మంటాయి!
నీకోసమే బార్లన్నీ తెరుస్తారు!
స్థిరాస్తులు నిన్నే వరిస్తాయి!
4.వాడికున్నవి పంచప్రాణాలే!
   తెగించి నిత్యం పోరాటం!
   బిగిసిన అనన్య ఆరాటం!
  మారని గానుగెద్దు జీవితం!
5.జీవితం విశేషమా!
   జీవితం సశేషమా!
   ఇది విషయం కాదు!
  జీవనభాగహారఫలం!
  నిశ్శేషం, నిజంగా ఓ విశేషం!