బాలగేయు:-సత్యవాణి
చినుకూ చినుకూ
ఎక్కడికే పరుగెక్కడికే
చెరువులు నింపగ పోతున్నా

చెరువూ చెరువూ
ఎక్కడికే పరగెక్కడికే
నదిని చేరగా పోతున్నా

నదీ నదీ ఎక్కడికే
పరుగెక్కడికే
సంద్రం చేరగ పోతున్నా 
నే సంద్రం చేరగ పోతున్నా

నీటి ఆవిరీ ఎక్కడికే
పరుగెక్కడికే
నింగికి నేనూ పోతున్నా
మేఘమాలగా మరలొస్తా
పుడమకి వర్షాన్ని తెచ్చిస్తా