సెల్ఫీ ప్రమాదం :మెరుపులు:- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
చదవేస్తే  ఉన్నమతిపోయినట్టు 
సెల్ఫోన్తో  సయ్యాటలు 
చేసేదేమో తెలియనట్టు 
ప్రమాదకరమైన చేష్టలు !

పులులు, సింహాలు 
సెల్ఫీకోసం పుట్టాయా 
నాగుపాము విషపుకోరలు 
అందంగా కనిపించాయా!

చిటికేస్తే పోయేప్రాణము 
జీవితం క్షణభంగురమోయ్ 
కుటుంబం గుర్తుఉండడము 
చెత్తపనికి వెనుకాడడమోయ్!

తెలిసిమసలుకో సెల్ఫీవీరా 
గులేబకావళి  కథకాదులే 
బుద్ధిమారి వెనక్కుపోరా 
నీవాళ్ళు ఎదురుచూపులే!

ప్రమాదం అంచుల్లో 
కావాలని ఉండరాదు 
విలువైన జీవితంలో 
చరవాణిమోజు సరికాదు !