అమ్మంటే ...అమ్మే ..!!:- ------కస్తూరి విజయలక్ష్మి హైదరాబాద్.

 రక్త పు ముద్దకు
ఆకృతి నిచ్చేదే
అమ్మ....!
నడక నుండి
నడత వరకు
నడిపేదే
అమ్మ...!
పరీక్షలో
పరిరక్షణలో
సహకరించేది
ఆమ్మ.....!
మనుగడలో
మ మ త ను
మనసులో
అల జడిని
మాయం
చేసేదే
అమ్మ....!
నిన్నులాలించేది
నీ సంతానాన్ని
లాలించేది
అమ్మ....!
అనుక్షణం
పిల్లల బాగుకోసం
పరితపించే ది
అమ్మ...!
ఏమని చెప్పగలం
ఎం తని వ్రాయగ లం
అమ్మ అంటే-
అమ్మే ....!!
  
 

కామెంట్‌లు