విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలు పరిమితం చేయకుండా ఉపాధ్యాయులు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి కృషి చేయాలని ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ జోగురామన్న గారు పేర్కొన్నారు.
శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లో జైనథ్ మండలంలోని కూర ఉన్నత పాఠశాల కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని గీస శ్రీజ రాసిన శ్రీజ కథలు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు .
ఒక 9 వ తరగతి విద్యార్థిని 20 కథలు రాసి ముద్రించడం అభినందనీయమన్నారు .గీస శ్రీజ మంచి కథా రచయితగా ఎదగాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొదటిసారిగా ఒక విద్యార్థినిచెే కథలు రాయించి ముద్రించి నందుకు కూర పాఠశాల ఉపాధ్యాయులను ఆయన అభినందించారు జంతువులు ,పక్షులసు పాత్రధారులుగా రాసిన పిల్ల ఏనుగు తెలివి, ఎలుక_ ఒంటె కలిసుందాం లాంటి కథలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు పాఠశాలలో జరిగిన సంఘటనను కథగా మలచి రాసిన కథల పుస్తకం బాగుందన్నారు. గీస
శ్రీజ భవిష్యత్తులో పుస్తకాలు రాయాలని దీనికి ఎల్లవేళలా మా సహకారాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఏ రవీందర్ రెడ్డి గారు కూర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి అశోక్ గారు పాల్గొన్నారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి